న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 181 పరుగుల తేడాతో గెలిచింది. విజయంలో స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కీలకపాత్ర పోషించాడు. 124 బంతుల్లో 182 పరుగులు చేశాడు. అయితే సెంచరీ అనంతరం స్టోక్స్ డిఫ్రెంట్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మిడిల్ ఫింగర్ మినహా మిగిలిన ఫింగర్స్‌ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేషన్స్ చేశాడు. అయితే అది తన తండ్రి గెడ్‌కు గుర్తుగా అలా చేశాడు. తన తండ్రి 1980ల్లో రగ్బీ లీగ్‌లో గాయపడటంతో మిడిల్ ఫింగర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ సందర్భంలో ఆ వేలును కాస్త కత్తిరించారు. దీంతో స్టోక్స్ తన తండ్రిని ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఐపీఎల్‌లోనూ ఇదే తరహాలో ఓ సారి సెలబ్రేషన్స్ చేశాడు.
అయితే బెన్‌స్టోక్స్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు గతేడాది జులైలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. పనిభారం పెరుగుతుందని వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. టీ20లు, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపాడు. కానీ తన రిటైర్మెంట్‌ను ఇటీవల వెనక్కి తీసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ ప్రకటించిన వన్డే ప్రపంచకప్ ప్రొవిషనల్ జట్టులో స్టోక్స్ పేరు ఉంది. కాగా, 2019 ప్రపంచకప్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీలో స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్నాడు. అక్టోబర్‌లో భారత్ వేదికగా 2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.