JOBS: ఇంటర్ అర్హతతో 1,207 ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్టెనోగ్రాఫర్‌ సి (గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌ ), స్టెనో గ్రాఫర్‌ డి (గ్రూప్‌ సి)కి అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆగస్టు 24, 25 తేదీల్లో సవరించుకోవచ్చు.

నోటిఫికేషన్‌ వివరాలు
మొత్తం ఉద్యోగాలు 1207: వాటిలో స్టెనోగ్రాఫర్‌ Grade C-93, స్టెనోగ్రాఫర్‌ Grade D-1114 పోస్టులు ఉన్నాయి.
అర్హత: అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి.
వయోపరిమితి: స్టెనోగ్రాఫర్‌ సి పోస్టులకు ఆగస్టు 1, 2023 నాటికి 18-33, స్టెనోగ్రాఫర్‌ డి ఉద్యోగానికి 18-27 ఏళ్లు ఉండాలి. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది)
అక్టోబరులో నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌.
పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in లో చూడొచ్చు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం