రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యానిమల్’ . ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు, రాజమౌళి చీఫ్ గెస్ట్‌లుగా వచ్చారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ను కొనియాడారు. ”ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. హిట్‌లు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. అవి తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొతాన్ని షేక్ చేసే డైరెక్టర్ వస్తాడు. సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి.. నా తరంలో రాంగోపాల్ వర్మ. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. సినిమా ఇలాగే తీయాలన్న ఫార్ములా పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా” అని సందీప్ రెడ్డి వంగాపై దర్శక ధీరుడు ప్రశంసలు కురిపించాడు.