శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం.. బోర్డు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, క్రికెట్ బోర్డులో మితిమీరిన అవినీతితో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్‌ రణసింగే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 1996లో ప్రపంచకప్‌ అందించిన అర్జున రణతంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఏడు మందితో కూడిన ఈ బృందంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా ఉన్నారు. బోర్డులో అవినీతి ఆరోపణలు పెరగడంతో.. ఆందోళనల మధ్యలో క్రికెట్‌ బోర్డు కార్యదర్శి శనివారం రాజీనామా చేశారు. అనంతరం క్రికెట్‌ బోర్డు మొత్తాన్ని రద్దు చేయడం గమనార్హం. భారత్‌ చేతిలో రికార్డు ఓటమి చవిచూసిన శ్రీలంక.. ప్రపంచకప్‌ టేబుల్‌లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ దిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం