కర్ణాటకలో విజయాన్ని తెచ్చిపెట్టిన సంక్షేమ పథకాల వాగ్దానాలను తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అమలుపరచనుంది. ఈ మేరకు ఆరు గ్యారెంటీ హామీలను ఆదివారం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఆ వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేయాలనేదే తమ స్వప్నమని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు వాగ్దానాలు:
మహాలక్ష్మి పథకం
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
పేద మహిళలకు కేవలం రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
రైతు భరోసా
ఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు
వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్
ఇందిరిమ్మ ఇళ్ల పథకం
ఇందిరిమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
తెలంగాణ ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం
గృహజ్యోతి పథకం
గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
చేయూత పథకం
చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా
చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్
యువ వికాసం
యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5లక్షల వరకు సాయం.