Siraj- సిరాజ్‌ దెబ్బకు లంక కుదేలు.. 50 రన్స్‌కే ఆలౌట్‌


శ్రీలంకతో జరుగుతున్న ఆసియాకప్‌ ఫైనల్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంచలన ప్రదర్శన చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆరు వికెట్ల పడగొట్టాడు. అంతేగాక ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతడికి తోడుగా హార్దిక్‌ పాండ్య (3/3) కూడా చెలరేగడంతో లంక కుదేలైంది. 50 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక టీమ్‌లో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఏకంగా అయిదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. వన్డేల్లో లంక జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇక వన్డే ఫైనల్లో తక్కువ స్కోరు సాధించిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డు నమోదుచేసుకుంది.

రికార్డులు

  • భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే.
  • వన్డే ఫైనల్లో అత్యల్ప స్కోరు సాధించిన జట్టుగా శ్రీలంక నిలిచింది.
  • వన్డేల్లో టీమిండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగో బౌలర్‌గా సిరాజ్‌ (6/21) నిలిచాడు. తొలి మూడు స్థానాల్లో స్టువర్ట్‌ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), జస్ప్రీత్ బుమ్రా (6/19) ఉన్నారు.
  • వన్డేల్లో శ్రీలంకపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా సిరాజ్‌ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు వకర్‌ యునిస్‌ పేరిట ఉండేది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం