Virat Kohli: యోయో టెస్టులో కోహ్లిని అధిగమించిన గిల్‌

యోయో టెస్టు స్కోరులో స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లిని యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్ గిల్‌ అధిగమించాడు. మరికొన్నిరోజుల్లో ఆసియాకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ యోయో ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించింది. శుక్రవారం కర్ణాటకలోని ఆలూర్‌లో నిర్వహించిన శిబిరంలో టెస్టు జరిగింది. అయితే టీమిండియా అందరిలోకి గిల్‌ 18.7 స్కోరుతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియాలో కొనసాగడానికి ప్రతి ఆటగాడు అర్హత స్కోరు కనీసం 16.5 ఉండాలి. ఇటీవల గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్‌ కూడా ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో పాల్గొన్నాడు. ఆటగాళ్లందరూ అర్హత సాధించినట్లు బీసీసీఐ ఒక అధికారి తెలిపారు.

తన యోయో టెస్టు స్కోరు 17.2గా కోహ్లి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సోషల్‌ మీడియాలో స్కోర్డు వెల్లడించడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. యోయో స్కోరును పంచుకోవడం సెంట్రల్‌ కాంట్రాక్టు ఉల్లంఘన కిందకు వస్తుందని వెల్లడించింది. కానీ గిల్‌ స్కోరు బయటకు రావడం గమనార్హం. కాగా, యోయో టెస్టు స్కోరును నిర్ధారించడం కోసం చివరగా ఎప్పుడు మ్యాచ్‌ ఆడారు? గత వారం రోజుల్లో పని ఒత్తిడి ఎలా ఉందని అంచనా వేసి, ఫిట్‌నెస్ట్‌ టెస్టు నిర్వహించి స్కోరును ఇస్తారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం