స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించందన్న ధావన్ వాదనలను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని భార్య ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు పేర్కొంది. సెలవుల్లో తన కుమారుడిని ఇండియాకు తీసుకువచ్చేందుకు ధావన్‌కు అనుమతి ఇచ్చింది. ధావన్, ఆయేషా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కాగా, ఆయేషాకు ఇది రెండో వివాహం. ఆమె మొదటి నుంచి ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. పెళ్లి తర్వాత భారత్‌కు వచ్చి తనతో జీవిస్తానని చెప్పినట్టు ధావన్ కోర్టుకు వివరించారు. కానీ మాజీ భర్త ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ఆమె ఆసీస్‌లోనే ఉంటున్నారు. ఇక ధావన్‌కు జన్మించిన కొడుకూ ఆమెతోనే ఉండటం గమనార్హం.