న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో.. ఏడు వికెట్లతో షమి.. ప్రత్యర్థిని చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ ఓటీటీలో రికార్డు సృష్టించింది. ఓటీటీ హిస్టరీలోనే హాట్‌స్టార్ హైయెస్ట్ వ్యూస్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో 53 మిలియన్ వ్యూస్‌ను రిజిస్టర్ చేసింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. కోహ్లి తన 50వ సెంచరీ అందుకునే టైమ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌కు చేరింది. అయితే ఛేదనలో విలియమ్సన్, మిచెల్ కీలక భాగస్వామ్యంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆ టైమ్‌లో మరోసారి బంతిని అందుకున్న షమి.. కీలక వికెట్లు పడగొట్టి కివీస్ ను ఒత్తిడిలోకి నెట్టారు. ఆ టైమ్‌లోనే వ్యూస్ 53 మిలియన్ల మార్క్‌ను అందుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తాచాటిన షమి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.