షారుక్‌ ఖాన్‌కు బెదిరింపులు.. Y+ భద్రత

బాలీవుడ్‌ స్టార్‌హీరో షారుక్‌ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత పెంచింది. వై-ప్లస్‌ కేటగిరీ భద్రతను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల షారుక్‌కు బెదిరింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. షారుక్‌ నటించిన జవాన్‌, పఠాన్‌ సినిమాలు భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత షారుక్‌కు బెదిరింపులు పెరిగాయి. షారుక్‌ను చంపేస్తామంటూ ముంబయిలోని అతడి నివాసం మన్నత్‌కు పలు లేఖలు కూడా వచ్చాయి. దీంతో అతడు ముంబయి పోలీసులను ఆశ్రయించాడు. బెదిరింపు కాల్స్‌ దృష్ట్యా మరింత భద్రత కల్పించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించింది. వారు మూడు షిఫ్టుల్లో షారుక్‌కు భద్రత కల్పించనున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం