బెంగళూరులో చెత్త ఏరుకునే సల్మాన్ షేక్ అనే వ్యక్తికి దాదాపు రూ.25 కోట్లు విలువైన కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. అయితే అవి మన నోట్లు కావు.. అమెరికా డాలర్లు. నవంబర్1న సల్మాన్‌కు దొరకగా.. కొన్నిరోజుల తర్వాత ఈ విషయాన్ని తన యజమాని బప్పాకి చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానందకు వివరించారు. అయితే పోలీసులు కేసును దర్యాప్తు చేయగా… ఈ మొత్తం విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ నోట్లపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు గుర్తించారు. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకి చెందిన వారు ఈ కరెన్సీ నోట్లను అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా అవి ఒరిజినల్ డాలర్లేనా? లేదంటే నకిలీవా? అని గుర్తించేందుకు వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వాటిని క్షుణ్నంగా పరిశీలించగా ఆ నోట్లు నకిలీవిగా గుర్తించారు. ఆ నోట్లు ఫొటోకాపీ, లేదా ప్రింట్ తీసినవిగా అధికారులు తెలిపారు.
330
previous post