వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన హిట్‌మ్యాన్ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అయితే వాంఖడేలో గత నాలుగు చివరి వన్డేల్లో రోహిత్ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ వేదికగా ఆడిన చివరి 4 వన్డేల్లో కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. 2015లో దక్షిణాఫ్రికాపై 16 పరుగులు, 2017లో న్యూజిలాండ్‌పై 20 పరుగులు, 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 10 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ఈ మ్యాచ్ మినహాయిస్తే ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రోహిత్ సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడు అతడే. ఏడు మ్యాచ్‌ల్లో 57 సగటుతో 402 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.