రికార్డులతో పెవిలియన్‌కు చేరిన రోహిత్‌

అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా ఫైనల్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా ఆడుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన హిట్‌మ్యాన్ పలు రికార్డులతో పెవిలియన్‌కు చేరాడు. ఈ ప్రపంచకప్‌లో 31 సిక్సర్లు బాదిన అతను అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే 54 సగటుతో 597 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ అత్యధిక రన్స్‌ సాధించిన కెప్టెన్‌గా ఘనత సాధించాడు. రోహిత్ ఈ మెగాటోర్నీలో పవర్‌ప్లేలోనే 401 పరుగులు సాధించడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు చేశాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం