ప్రపంచకప్‌లో టీమిండియాను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోలీసులు జరిమానాలు విధించారు. ముంబయి-పుణె మార్గంలో అతడు తన కారును 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు ఫైన్లు వేశారు. ఒక దశలో హిట్‌మ్యాన్ కారు అత్యధికంగా 215 కి.మీ వేగాన్ని కూడా అందుకోవడం గమనార్హం. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం రోహిత్ ఫ్లైట్‌లో ముంబయికి చేరుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ కోసం ముంబయి నుంచి పుణెకు తన స్పోర్ట్స్ కారు లాంబోర్ఘినిలో వెళ్లాడు. ప్రపంచకప్ జరుగుతున్న ఈ టైమ్‌లో రోహిత్ ఇలాంటి రిస్క్‌లు తీసుకోవడం అవసరమా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే గతేడాది పంత్ కారు ప్రమాదానికి గురై ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలైన పంత్ మూడు సర్జరీలు కూడా చేయించుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఆసియాకప్, ప్రపంచకప్‌కు దూరమైన ఈ యువ వికెట్ కీపర్ ప్రస్తుతం కాస్త వేగంగానే కోలుకుంటున్నాడు. తాజాగా ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు.