టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తొందరగా కోలుకుంటున్నాడు. ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరుగులు తీస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన పంత్ తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు సర్జరీలు చేయించుకున్నాడు. దాంతో ఐపీఎల్‌తో పాటు ఆసియా కప్, ప్రపంచకప్‌లకు దూరమ్యాడు. అయితే గాయం తీవ్రత వల్ల అతడు పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని భావించారంతా. కానీ పంత్ కాస్త వేగంగానే కోలుకుంటున్నాడు. గతంలో నడవడం, సైక్లింగ్, జిమ్‌లో బరువులు ఎత్తడం వంటి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న పంత్… ఈ సారి వేగంగా పరిగెత్తుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై ఫ్యాన్స్‌తో పాటు ఆటగాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ‘మేడ్ మై డే దిస్’ అని కామెంట్ చేయగా, స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఎమోజీలతో ఆనందం వ్యక్తం చేశాడు.
444
previous post