ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రింకూ సింగ్‌ను కొనియాడాడు. ”వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో.. ఆఖర్లో పరుగులు చేయాల్సిన ఒత్తిడిలో కూడా రింకూ చాలా ప్రశాంతంగా కనిపించాడు. బ్రిలియంట్‌గా ఆడుతున్నాడు. అతడు మరో గొప్ప ఆటగాడిని గుర్తుచేస్తున్నాడు. అది ఎవరో అందరికీ తెలుసు” అంటూ ధోనీతో రింకూను ఇండైరెక్ట్‌గా కంపేర్ చేశాడు. తొలి టీ20లో టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన టైమ్‌లో రింకూ క్రీజులో ఉన్నాడు. ఆ బంతిని సిక్సర్ బాది గెలిపించిన సంగతి తెలిసిందే. రెండో టీ20లోనూ భీకర హిట్టింగ్తో ఆసీస్ బౌలర్లను రింకూ వణింకించాడు. 9 బంతుల్లోనే ఏకంగా 31 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఫినిషర్‌గా రింకూ సత్తాచాటాడు.
48
previous post