శతకాల వీరుడిగా విరాట్.. భారత్ 397/4

వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 117 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్‌ 105, గిల్ 80, రోహిత్ శర్మ 47, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో సౌథి మూడు వికెట్లు, బౌల్ట్ ఒక్క వికెట్ తీశారు.

ఆది నుంచే రోహిత్‌ శర్మ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల మోత మోగించాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్‌ 47 పరుగుల వద్ద ఔటయ్యాడు. గిల్‌ కూడా అతడికి సహకారం ఇవ్వడంతో భారత్‌ పవర్‌ప్లేలో ఏకంగా 84 పరుగులు సాధించింది. కివీస్‌కు ఛాన్స్‌ ఇవ్వకుండా గిల్‌-కోహ్లి ఇన్నింగ్స్‌ నడిపించారు. మంచి బంతుల్ని గౌరవిస్తూ చెత్త బంతుల్ని బౌండరీకి తరలించారు. అయితే గిల్ 79 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత బౌండరీల బాదే బాధ్యతను కోహ్లి-శ్రేయస్ తీసుకున్నారు. ఈ క్రమంలో కోహ్లి తన వన్డే కెరీర్‌లో 50వ శతకాన్ని అందుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. సచిన్‌ ఈ ఫార్మాట్ లో 49 సెంచరీలు చేశాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా కివీస్ బౌలర్లపై శివమెత్తడంతో పరుగులు పోటెత్తాయి. అతడు 67 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్‌ రాహుల్ 20 బంతుల్లోనే 39 పరుగుల చేయడంతో కివీస్‌ ముందు భారత్‌ కొండంత లక్ష్యాన్ని ఇచ్చింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం