ప్రసిధ్‌ ఎంపికకు కారణమదే- ద్రవిడ్‌

స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య చీలమండ గాయంతో ప్రపంచకప్‌ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. హార్దిక్‌ స్థానంలో యువపేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ జట్టులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా పేసర్‌ను తీసుకోవడంపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రసిధ్‌ ఎంపిక గురించి టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ”ఇప్పటి వరకు మేం ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్లో ఆడాం. ప్రస్తుత భారత జట్టులో స్పిన్‌కు బ్యాకప్‌గా రవిచంద్రన్‌ అశ్విన్ ఉన్నాడు. అలాగే ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాకప్‌ ఉన్నాడు. కానీ పేసర్లకు బ్యాకప్‌ లేరు. ఎవరైనా అనారోగ్యానికి గురైనా, గాయపడ్డా.. వారిని భర్తీచేయడానికి బ్యాకప్‌ తప్పక అవసరమని గుర్తించాం. అందుకే ఎంపిక చేశాం. ఇది డిఫ్రెంట్ కాంబినేషన్లతో మేం ఆడేందుకు ఉపయోగపడుతుంది” అని ద్రవిడ్ చెప్పాడు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్‌ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్‌ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్‌ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు. హార్దిక్‌ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. అతడు టోర్నీ మొత్తానికి దూరమవ్వడంతో ఇప్పుడు జట్టు సమతూకం దెబ్బతినే ప్రమాదముంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం