Realme 5G Sale- స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

రియల్‌మీ 5జీ (Realme 5G) స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 17 వరకు ఇది కొనసాగనుంది. ప్రస్తుతం రియల్‌మీ వెబ్‌సైట్‌లో ఈ సేల్‌ అందుబాటులో ఉంది. కొత్తగా విడుదల చేసిన రియల్‌మీ నార్జో 60x 5జీ ఫోన్‌ఫై రూ.1,000 రాయితీతో రూ.11,999కి లభించనుంది. అదనంగా రూ.279 విలువ చేసే కాయిన్స్‌ రివార్డుగా వస్తాయి. రు నెలల పాటు స్క్రీన్‌ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్‌ విక్రయానికి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే.

రియల్‌మీ 11 సిరీస్‌లో రియల్‌మీ 11 5జీ, 11 ప్రో, 11 ప్రో+కు కూడా ఆఫర్స్‌ ఉన్నాయి. రియల్‌మీ 11 5జీపై రూ.1,500; 11 ప్రో, 11 ప్రో+పై రూ.2,000 వరకు తగ్గింపు లభించనుంది. రియల్‌మీ నార్జో 60 5జీపై రూ.1,300, నార్జో 60 ప్రో 5జీపై రూ.2,000 వరకు రాయితీ అందుబాటులో ఉంది. ICICI,కోటక్‌ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌ కార్డులతో లావాదేవీలు చేసేవారికి మరో రూ.250 తగ్గింపు ఉంటుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం