RBI: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని, యథాతథంగా కొనసాగుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. వరుసగా మూడోసారి కూడా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పరపతి విధాన కమిటీ (MPC) సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్‌ దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటు 6.5 %, బ్యాంక్‌ రేటు, మార్జినల్ స్టాండింస్‌ ఫెసిలిటీ రేటు 6.75 వద్దే కొనసాగుతున్నయని తెలిపారు.

ద్రవ్యోల్బణంపై ఎంపీసీ దృష్టి సారించిందని, అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి అయిన 4 శాతం ఎగువనే ఉందని శక్తికాంత్ దాస్‌ తెలిపారు. వృద్ధిరేటు గురించి మాట్లాడుతూ.. గత అంచనాలను అనుగుణంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా, ద్రవ్యోల్బణ కట్టడి మేరకు 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం