రవితేజ హీరోగా నటిస్తున్న మొట్టమొదటి బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా విడుదల వాయిదా పడిందని, అక్టోబర్ 20న రిలీజ్ కావడం లేదంటూ ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని శక్తులు ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న కచ్చితంగా విడుదల అవుతుందని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడిందని.. డిస్ట్రిబ్యూటర్లు, వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి తొలి ప్రాధాన్యం తమ సినిమాకే వస్తోందని తెలిపారు. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ బరిలో టైగర్ వేట పార్రంభం అవుతుందంటూ ప్రకటించారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. దీనికి వంశీ దర్శకుడు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ ‘అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా వస్తోంది టైగర్ నాగేశ్వరరావు. అంతేకాదు, రవితేజ కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ. విజయ దశమి అక్టోబర్ 20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు గతంలో ప్రకటించారు.
అయితే, ఆ తేదీకి సినిమా రావడం లేదని వాయిదా పడుతుందని ప్రచారం మొదలైంది. వెంటనే యూనిట్ అలెర్ట్ అయింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జ్ పై రిలీజ్ చేశారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ దశమికి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దానికి పోటీగా వస్తోంది టైగర్ నాగేశ్వరరావు.