మాట్లాడుకోవడానికి కూడా రణ్‌వీర్‌- దీపికా షెడ్యూల్‌!

బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌వీర్‌ సింగ్ – దీపికా పదుకొణె ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉంటారు. అయితే వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయాన్ని షెడ్యూల్‌ చేసుకుంటారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దీపిక చెప్పింది. ”నా భర్తతో సమయం గడపడం చాలా ముఖ్యం. కానీ, మా ఇద్దరికీ అంత తీరిక ఉండదు. ఒక్కోసారి నెల రోజుల పాటు షూటింగ్‌ కోసం వెళ్లాల్సి వస్తుంటుంది. లేదంటే రణ్‌వీర్‌ షూటింగ్‌ అయిపోయి ఇంటికి వచ్చే సమయానికి నేను షూటింగ్‌కు వెళ్లాల్సి రావొచ్చు. అందుకే మేం కలిసి గడపాల్సిన సమయాన్ని కూడా షెడ్యూల్‌ చేసుకుంటాం. ఎంత సమయం గడిపామన్నది ముఖ్యం కాదు. గడిపిన కొంత సమయాన్ని ఎంత ఎంజాయ్‌ చేశామనేది ముఖ్యం” అని దీపికా చెప్పింది. 2013లో విడుదలైన ‘రామ్‌ లీలా’ కోసం దీపిక-రణ్‌వీర్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఈ సినిమా టైమ్‌లో ప్రేమలో పడిన వారిద్దరు 2018లో ఒక్కటయ్యారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం