ఎనర్జిటిక్ హీరో రామ్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే ఒక ఫైట్ సీన్‌లో రామ్ ప్లేస్‌లో బోయపాటీ కనిపించారు. ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై హీరో రామ్ స్పందించాడు. ”ఏప్రిల్ 24న ఈ ఫైట్‌ను షూట్ చేశాం. ఈ సీన్ తర్వాత నేను నడవలేకపోయా. అడుగు కూడా వేయలేని పరిస్థితి. పాదాలు పగిలి రక్తం వచ్చింది. ఇక ఈ సీన్‌లో ఎలా నటించాలో బోయపాటి శ్రీను స్వయంగా చేసి చూపారు. అంత కష్టపడినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. మన సినిమాలోని కంటెంట్ అందరికీ నచ్చాలని రూల్ లేదు. అది పూర్తిగా ప్రేక్షకుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. నేను మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం ఏమీ ఆశించకుండా.. నా రక్తాన్ని చెమటగా చిందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అంటూ ఆ సన్నివేశంలో గాయపడిన తన కాలు ఫొటోను రామ్ షేర్ చేశాడు.