డైరెక్టర్‌ శంకర్‌కు రామ్‌చరణ్‌ డెడ్‌లైన్‌!

రామ్‌ చరణ్- శంకర్‌ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే డైరెక్టర్ శంకర్‌ ‘ఇండియన్‌-2’పై ఎక్కువగా ఫోకస్‌ చేయడంతో గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ చాలా స్లో అయింది. మరోవైపు చరణ్ కోసం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ప్రి ప్రొడక్షన్, కాస్టింగ్ ఎంపిక కూడా దాదాపు బుచ్చిబాబు పూర్తిచేశాడు. కానీ చరణ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియక వెయిట్ చేస్తున్నాడు. దీంతో ఫిబ్రవరిలోపు ‘గేమ్ చేంజర్’ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని, మార్చి నుంచి బుచ్చిబాబు సినిమాను మొదలుపెట్టి తీరాలని చరణ్ ఫిక్సయ్యాడట. ఈ మేరకు శంకర్‌కు సైతం స్పష్టంగా చెప్పేసినట్లు సమాచారం.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం