jailer
Home » Rajinikanth’s Jailer: జైలర్‌ మూవీ రివ్యూ

Rajinikanth’s Jailer: జైలర్‌ మూవీ రివ్యూ

by admin
0 comment

నటీనటులు: రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌, రమ్యకృష్ణ, వినాయకన్‌, మిర్నా మేనన్‌, తమన్నా, యోగిబాబు తదితరులు
రచన, దర్శకత్వం: నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌
బ్యానర్స్: సన్‌ పిక్చర్స్‌
నిర్మాత: కళానిధి మారన్‌
డీఓపీ: విజయ్‌ కార్తిక్‌ కణ్ణన్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
ఎడిటర్: ఆర్‌. నిర్మల్‌
నిడివి: 168 నిమిషాలు
సెన్సార్: U/A
రేటింగ్: 2.75/5

దాదాపు రెండేళ్ల తర్వాత రజనీకాంత్‌ మరో సినిమాతో వచ్చారు. తమిళ, తెలుగు అభిమానులే గాక, దేశమంతా ‘సూపర స్టార్‌’డమ్‌ ఉన్న ఆయన.. మూడు సినిమాలే అనుభవం ఉన్న దర్శకుడు నెల్సన్ దిలీప్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ‘జైలర్’ సినిమా ఎలా ఉందంటే?

కథ
ముత్తు (ర‌జ‌నీకాంత్‌) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. జైలర్‌గా విధులు నిర్వర్తించాడు. రిటైర్మెంట్‌ తర్వాత కుటుంబమే లోకంగా గడుపుతుంటాడు. భార్య (రమ్యకృష్ణ), పోలీసు అధికారిగా పనిచేసే కుమారుడు అర్జున్‌, మనవడే అతడి ప్రపంచం. అయితే క్రిమినల్స్‌ పట్ల కఠినంగా వ్యవహరించే అర్జున్‌కు విగ్రహాలు దొంగతనం ముఠా నుంచి సవాలు వస్తుంది. వారిని కట్టడి చేసే ప్రయత్నంలో అర్జున్ మిస్‌ అవుతాడు. తన కుమారుడిని దక్కించుకోవడం కోసం ముత్తు ఎలా ప్రయత్నించాడు? చివరికి కాపాడగలిగాడా? ముఠా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది స్క్రీన్‌పైనే చూడాలి.

సినిమాలో ర‌జ‌నీకాంత్‌ తాతయ్యగా నటించినా మాస్‌, స్టైల్‌, హీరోయిజానికి కొదవ ఉండదు. ఫ్యాన్స్‌కు మునపటి రజనీని చూపించాడు. కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకుంటాడు. భావోద్వేగ సన్నివేశాల్లో తన మార్క్‌ను చూపిస్తాడు. శివరాజ్‌ కుమార్‌, మోహన్ లాల్‌, జాకీష్రాఫ్‌ చేసిన కేమియో రోల్స్‌ ఆకర్షణగా నిలిచినా పాత్రలు విడివి తక్కువగా ఉంటుంది. గృహిణిగా కనిపించిన రమ్యకృష్ణ పాత్రకి కూడా ప్రాధాన్యం అంతగా ఉండదు. కమెడియన్ యోగి బాబు, మనవడు రిత్విక్‌తో రజనీ ఉండే సన్నివేశాలు బాగుంటాయి. అనిరుధ్‌ సంగీతం సినిమాకు ప్రధాన బలం. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ అదరగొట్టాడు. అయితే సాంగ్స్‌లో తమన్నా ఆకట్టుకున్నా తన స్టార్‌డమ్‌కు తగిన రోల్‌ కాదని చెప్పొచ్చు. రొటీన్‌ కథ, స్క్రీన్‌ ప్లే, ట్విస్ట్‌లు ముందే ఊహించేలా ఉంటాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links