Adani Groupపై JPCతో విచారణ చేయాలి- Rahul Gandhi

అదానీ గ్రూప్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైనాన్షియల్‌ వార్తా పత్రికలు ఇచ్చిన రిపోర్ట్‌లను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్తిమంగా పెంచారని, దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నో ఆస్తులు కొన్నారని అన్నారు. ఈ డబ్బంతా ఎవరిదిని ప్రశ్నించారు. అక్రమాల వెనుక గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీది మాస్టర్‌ మైండ్ అని ఆరోపించారు. ముంబయిలో విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశానికి విచ్చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

అదానీ వ్యవహారంపై అంతర్జాతీయంగా ప్రముఖ ఫైనాన్షియల్‌ వార్తా పత్రికలు ఎన్నో కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని రాహుల్ అన్నారు. గతంలో వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని, అయితే క్లీన్‌చిట్‌ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు అదానీకి చెందిన ఎన్డీటీవీలో డైరెక్టర్‌గా ఉన్నారని తెలిపారు. దీన్ని బట్టే అదానీ గ్రూప్‌లో ఏదో తప్పు జరుగుతున్నట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి సన్నిహితుడైన వ్యక్తి తన సంస్థ షేర్ల విలువ పెంచేందకు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టించారని అన్నారు. ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించరని ప్రశ్నించారు. త్వరలో దిల్లీలో జరిగే జీ20 సమావేశంలో అదానీ గ్రూప్‌పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని అన్నారు. అదానీ గ్రూపు వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వేసి సమగ్ర విచారణ జరిపించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం