vishwak
Home » ఆ మాత్రం బాధ ఉంటుంది.. విశ్వక్‌సేన్‌పై నాగవంశీ రియాక్షన్‌

ఆ మాత్రం బాధ ఉంటుంది.. విశ్వక్‌సేన్‌పై నాగవంశీ రియాక్షన్‌

by admin
0 comment

వైష్ణవ్‌ తేజ్‌- శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘ఆదికేశవ’ సినిమాను నవంబర్‌ 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదికేశవ సినిమాతో పాటు విశ్వక్‌సేన్‌ కాంట్రవర్సీ పోస్ట్‌లపై నాగవంశీ మాట్లాడాడు. ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8న అనుకున్నప్పుడు వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఒక్కటే ఉంది. కానీ అనుకోకుండా నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్‌ట్రార్డినరీ’ సినిమాలు లైన్లోకి వచ్చాయి. నాని, నితిన్ మా బ్యానర్‌కు క్లోజ్ హీరోలు. అయితే వాళ్లతో కాంపీటిషన్ ఎందుకని నేను భావిస్తానని.. విశ్వక్ అనుకున్నాడేమో! అయితే అసలు పోస్ట్‌పోన్ గురించి ఇంకేం అనుకోలేదు. సినిమా షూటింగ్ ఇంకా ఉంది. తర్వాత రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాం. అయితే ఓ డేట్ వేసి మార్చితే ఏ హీరోకైనా బాధగానే ఉంటుంది” అని నాగవంశీ చెప్పాడు. “బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ ఒక్కడూ మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. తగ్గే కొద్దీ మింగుతారు. డిసెంబర్ 8న వస్తున్నాం. డిసెంబర్‌లో సినిమా రాకపోతే నేను ప్రమోషన్స్ లో కనిపించను” అని విశ్వక్‌సేన్‌ పోస్ట్‌లు పెట్టిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links