WIvIND: కుర్రాళ్లకు సవాల్‌.. విండీస్‌తో నేడు మ్యాచ్‌

ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న యువ ఆటగాళ్లే అందరూ. కానీ టీమిండియాకు (TeamIndia) తొలి టీ20లో షాక్‌ ఎదురైంది. స్లోపిచ్‌పై కుర్రాళ్లు తడబడ్డారు. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ మినహా అందరూ నిరాశపరిచారు. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో నేడు భారత్ రెండో మ్యాచ్‌ (WIvIND) ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పుంజుకుని హార్దిక్‌ సేన తిరిగి రేసులోకి నిలబడాలని భావిస్తుంది.

తొలి మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు. నేడు జరిగే మ్యాచ్‌ కూడా మందకొడి పిచ్‌. మరి నేడు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారనే అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. వన్డే ప్రపంచకప్‌ సమరానికి సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లు సత్తాచాటాల్సి ఉంది. అంతేగాక కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాలి. తొలి టీ20లో బ్యాట్స్‌మెన్‌ తడబాటుతోనే మ్యాచ్‌ ఓడింది. అయితే టీమిండియాకు బౌలింగ్‌ కాస్త సానుకూలాంశం.

మరోవైపు తొలి మ్యాచ్‌లో గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్‌ బరిలోకి దిగనుంది. టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయినా పొట్టిఫార్మాట్‌ సిరీస్‌ను అయినా దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే రెండో టీ20 వేదికలో ఆ జట్టుకు మంచి రికార్డు లేదు. ఇక్కడ జరిగిన 11 మ్యాచ్‌ల్లో మూడు వర్షం వల్ల రద్దు కాగా.. మిగతా ఎనిమిది మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ అయిదు ఓడిపోయింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం