సోషల్‌ మీడియా డీపీలు మారుద్దాం- Pm Modi

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సామాజిక మాధ్యమాల డిస్‌ప్లే ఫొటోగా జాతీయ జెండాను పెట్టుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15వరకు కేంద్ర ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పౌరుల్లో దేశ భక్తిని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మోదీ ట్వీట్ చేశారు. ”స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియా ఖాతాల డీపీలో జాతీయ జెండాను ఉంచుదాం. దేశానికి, మనకు మధ్య బంధాన్ని మరింత పెంపొందించే ఈ కార్యక్రమానికి మద్దతు ఇద్దాం” అని ట్వీట్‌ చేశారు. కాగా, ఇప్పటికే ఎంతోమంది నెటిజన్లు మువ్వన్నెల జెండాను డీపీగా ఉంచారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం