Parineeti Chopra మ్యారేజ్‌ డేట్ ఫిక్స్‌

మే నెలలో ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకున్న నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ వివాహ తేదీ, వేదికను ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 25న రాజస్థాన్‌లో పెద్దల సమక్షంలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. పరిణీతికి చెందిన టీమ్, ఇప్పటికే పనులు ప్రారంభించింది.

పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. అయితే ఎప్పట్లానే పెళ్లి తేదీపై కూడా పరిణీతి గుంభనంగా ఉంది. ఎలాంటి సమాచారం అందించలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆమె తన పెళ్లి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అలా 3 వారాల పాటు పెళ్లి కోసం ప్రిపేర్ అవ్వబోతోంది పరిణీతి. పెళ్లి తర్వాత గురుగ్రామ్‌లో రిసెప్షన్ ఉంటుంది.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం ఉదయపూర్‌లోని ప్రసిద్ధ ఉదయ విలాస్ రిసార్ట్ తో జరుగుతుంది. దీనికి చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు మేవాడ్ మహారాజా యాజమాన్యంలోని ఒబెరాయ్ ఉదయవిలాస్ ఉండేది. 2018లో ఇషా అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలు ఇందులోనే జరిగాయి. గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయని బియోన్స్ ప్రదర్శన కూడా ఇందులోనే జరిగింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై పరిణీతి పెళ్లి జరగబోతోంది.

పరిణీతి-రాఘవ్ ప్రేమకథ చాలామందికి తెలిసే ఉంటుంది. వీళ్లిద్దరూ విదేశాల్లో చదువుకున్నప్పుడు క్లాస్ మేట్స్. ఆ తర్వాత ఎవరి రంగాల్లో వాళ్లు బిజీ అయ్యారు. ఐదేళ్ల కిందట ఇద్దరూ మళ్లీ క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం