ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, మహ్మద్ వసీమ్ చెరో మూడు వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా (56), లిటన్ దాస్ (45), షకీబ్ (43) పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌కు అదిరే ఆరంభం లభించింది. అబ్దుల్లా షఫీకి (68), ఫకర్ జమాన్ (81) తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం (128) నెలకొల్పారు. ఆది నుంచే బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు సాధించారు. వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ అజామ్ (9) మరోసారి విఫలమయ్యాడు. మూడు వికెట్లు పడినప్పటికీ పాక్ సాధికారికంగా ఆడి 32.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (26), ఇఫ్తికర్ మహ్మద్ (17) ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు.
అయితే ఈ ఓటమితో బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా ఆరు మ్యాచ్‌ల్లో ఓటిమిపాలైంది. ఒక్క నెదర్లాండ్స్‌పై మాత్రమే గెలిచింది. దీంతో అధికారింగా నాకౌట్ మ్యాచ్‌లకు అనర్హత సాధించింది. మరోవైపు పాకిస్థాన్ ఏడు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి అయిదో స్థానానికి చేరింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అయితే తమ జట్టు ప్రదర్శనపై మాత్రమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై పాక్ సెమీస్ ఆశలు ఆధారపడ్డాయి. పాక్ ఆడనున్న తర్వాత రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాక్ తప్పక గెలవాలి. అంతేగాక ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా అఫ్గానిస్థాన్‌ను ఓడించాలి. అలాగే దక్షిణాఫ్రికా, శ్రీలంక టీమ్స్ న్యూజిలాండ్‌పై విజయం సాధించాలి. దాంతో పాటు భారత్.. శ్రీలంక, నెదర్లాండ్స్‌పై గెలిస్తే పాక్ నేరుగా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఈ సమీకరణాలు ఛేంజ్ అయ్యి, పాక్ ఇతర టీమ్స్ పాయింట్స్‌తో సమానంగా ఉంటే.. ఆ జట్టు నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది.