ప్రముఖ సంస్థ వన్‌ప్లస్ తమ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్ తెలిపింది. వన్‌ప్లస్ ఓఎస్ అయిన ఆక్సిజన్ 13.1 వెర్షన్ అప్‌డేట్ చేసిన తర్వాత స్క్రీన్ ప్రాబ్లమ్ వచ్చే ఫోన్లకు.. లైఫ్‌టైమ్ స్క్రీన్ వారెంటీ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసిన తర్వాత గ్రీన్‌లైన్ సమస్య వస్తుందని పలు యూజర్లు ఇటీవల ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లలో ఈ గ్రీన్‌లైన్ ఇష్యూ ఎక్కువగా కనిపిస్తోందని ఫిర్యాదులు వచ్చాయి.
ఈ సమస్య ఎదుర్కొన్న వారు దగ్గర్లోని వన్‌ప్లస్ సర్వీసస్ సెంటర్‌కు వెళ్తే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేసి ఇస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. అయితే ఇండియాలో కొనుగోలు చేసిన వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్లకు ఈ సర్వీస్ వర్తిస్తుంది. స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌తో పాటు వోచర్ సదుపాయాన్నీ కూడా వన్‌ప్లస్ కల్పిస్తోంది. పాత ఫోన్ తీసుకుని కొత్త వన్‌ప్లస్ డివైజ్ కొనుగోలుకు వోచర్ అందిస్తోంది.