Pawan Kalyan’s OG- పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌


మరికొన్ని రోజుల్లో తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు హీరో పవన్ కల్యాణ్. ఈ పుట్టినరోజుకు చాలా హంగామా ఉండబోతోంది. ఎందుకంటే, పవన్ నుంచి 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కానీ వీటిలో ఒక్కటి మాత్రం బాగా ఆకర్షిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాదని ప్రకటించారు మేకర్స్. అయినప్పటికీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దీనికి ఓ కారణం ఉంది. ఓజీ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాదంటూ దర్శకుడు సుజీత్ ప్రకటించాడు. అంటే ఫస్ట్ లుక్ కాకుండా నేరుగా గ్లింప్స్ రిలీజ్ చేస్తామని దానర్థం. ఈ మేటర్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తోంది.

ఓజీ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న స్ట్రయిట్ మూవీ ఇదే. వకీల్ సాబ్, బ్రో, భీమ్లానాయక్.. ఇలా పవన్ చేసిన సినిమాలన్నీ రీమేక్ ప్రాజెక్టులే. ఎట్టకేలకు పవన్ నుంచి ఓజీ రూపంలో ఓ స్ట్రయిట్ మూవీ వస్తోంది. అందుకే అభిమానుల చూపు మొత్తం ఈ సినిమాపైనే ఉంది. ఇక పవన్ కల్యాణ్ మిగతా సినిమాల విషయానికొస్తే.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ గ్లింప్స్ రిలీజైంది. కాబట్టి, ఈసారి పుట్టినరోజుకు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో వీడియో రాకపోవచ్చు. వీడియో రిలీజ్ చేయడానికి మేకర్స్ దగ్గర ఫూటేజ్ కూడా లేదు.

ఇక పవన్ చేస్తున్న మరో సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రావాల్సిన ప్రమోషనల్ కంటెంట్ వచ్చేసింది. గ్లింప్స్ రిలీజ్ చేశారు, పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేస్తే, సినిమాపై బజ్ మాట అటుంచి, ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అయి, ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. సో.. పవన్ కల్యాణ్ పుట్టినరోజుకు ఓజీ నుంచి మాత్రం కచ్చితంగా హంగామా ఉంటుంది. మిగతా సినిమాల నుంచి కూడా ఏదైనా వస్తే అది బోనస్ అనుకోవాలి. వీటితో పాటు పవన్ నుంచి ఓ కొత్త సినిమా ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం