Bijlee: ఓలాలో కుక్కకు ఉద్యోగం

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీ సంస్థ ‘ఓలా’లో ఓ శునకానికి ఉద్యోగ అవకాశం లభించింది. ఆ కుక్కకు ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అవును, మీరు చదువుతుంది నిజమే! ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించాడు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే వైరల్.

‘బిజిలీ’ అనే పేరుతో ఆ శునకానికి గుర్తింపు కార్డు జారీ చేశారు. హిందీలో ‘బిజిలీ’ అంటే విద్యుత్తు అనే అర్థం వస్తుంది. అలాగే ఉద్యోగి గుర్తింపు సంఖ్యను ‘440 వీ’గా పేర్కొన్నారు. సాధారణంగా ‘ప్రమాదకరం హైఓల్టేజ్‌ 440v’ అని మెట్రో స్టేషన్లో, పరిశ్రమల్లో, ఇతర ఆఫీస్‌ ప్రాంతాల్లో చూస్తుంటాం. దాన్ని శునకానికి ఐడీలో ఇలా సరదాగా సూచించారు. కాగా, గుర్తింపు కార్డుపై ఓలా ఎలక్ట్రిక్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బెంగళూరు కార్యాలయం చిరునామా ముద్రించారు. కొరమంగళ శాఖలో భవీశ్‌ అగర్వాల్‌ కార్యాలయంలో ఆ శునకం పనిచేస్తోందని పేర్కొన్నారు. దానికి మరింత హాస్యాన్ని జోడిస్తూ బిజిలీని ‘స్లాక్‌’ ద్వారా సహోద్యోగులు కమ్యూనికేట్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం