దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా మూడు విద్యుత్ స్కూటర్లును ఆవిష్కరించింది. ఎస్1ఎక్స్ మోడల్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్‌ల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్1ఎక్స్ (2 కిలోవాట్ బ్యాటరీ) పరిచయ ధర రూ.79,999గా నిర్ణయించింది. ఎస్1ఎక్స్ (3 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్ రూ.89,999కు; ఎస్1ఎక్స్+ స్కూటర్ ధర రూ.99,999గా తెలిపింది. అయితే మొదటి వారం వరకే ఈ ధర ఉంటుందని, తర్వాత ప్రతి వేరియంట్‌పై రూ.10 వేలు పెరుగుతుందని వెల్లడించింది.
ఎస్1ఎక్స్, ఎస్1ఎక్స్+ మధ్య సాఫ్ట్వేర్, అనుసంధానత ఫీచర్లలో మార్పులు ఉంటాయని వివరించింది. ఎస్1ఎక్స్+ వేరియంట్ ‘కీ లెస్ అన్‌లాక్’ ఉంటుందని పేర్కొంది. కాగా, ఎస్1ఎక్స్ ఒకసారి ఛార్జింగ్‌తో 151 కి.మీ నడుస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ ఉంటుంది. ఏడు రంగుల్లో స్కూటర్ మోడల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.