ప్రయాణికులకు న్యూగో ట్రాన్స్‌పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఒక్క రూపాయి ఛార్జీతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ఆఫర్ ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచే ఆఫర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని పేర్కొంది.
ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలు అందించే న్యూగో సంస్థ ఈ ఆఫర్‌ను హైదరాబాద్-విజయవాడకే కాదు. ఇండోర్ – భోపాల్, ఢిల్లీ – చండీగఢ్, ఢిల్లీ – ఆగ్రా, ఢిల్లీ – జైపూర్, ఆగ్రా – జైపూర్, బెంగళూరు – తిరుపతి, చెన్నె – తిరుపతి, చెన్నై – పుదుచ్చేరి తదితర మార్గాల్లో కూడా అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. https://nuego.in/booking వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే చాలా మంది ఈ ఆఫర్ ను వినియోగించుకోవడానికి బుకింగ్స్ చేసుకుంటున్నారని పేర్కొంది.
ఇలా బుక్ చేసుకోండి
పైన పేర్కొన్న వెబ్‌సైట్ లింక్‌ను ఓపెన్ చేయండి. ప్రయాణ మార్గాలను ఎంచుకోండి. ప్రయాణ తేదీని ఆగస్టు 15గా సెలక్ట్ చేయండి. ఆ తర్వాత బస్సు టైమింగ్స్, ఖాళీల వివరాలు తెలుస్తాయి. అనంతరం బస్సు, సీటు నంబర్‌ను సెలక్ట్ చేసుకుని.. ఒక రూపాయిని చెల్లించండి.