స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఆమె ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తన ఆరోగ్యంపైనే మొత్తం ఫోకస్ పెట్టింది సమంత. ఇటీవల కైరో థెరపీ సెషన్‌కు కూడా హాజరైంది. అందులో ఆమె -150 డిగ్రీల ఫారెన్ హీట్‌లో పొగలు కక్కే చలిలో ఓ టబ్‌లో కూర్చొని కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న బాధల గురించి సమంత వివరించింది. విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టాయని, అవి ఎంతో కుంగిపోయేలా చేశాయని చెప్పింది.
‘‘ఒకవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. అదే టైమ్ లో నేను నటించిన సినిమాలకు కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతో బాధపడ్డా, గత రెండేళ్లుగా కుంగుబాటుకు గురయ్యా. అయితే ఆ టైమ్ లో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారు.. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్స్ ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో హెల్ప్ అయింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది’’ అంటూ సమంత ఎమోషన్ అయ్యింది.
నాగచైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేశావే’తో సమంత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య-సమంత ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే 2021లో విడిపోయారు. వీళ్లిద్దరూ విడిపోయి చాలా కాలమైనా వీళ్ల డివోర్స్ మేటర్ పై మాత్రం ఏదో ఒక కథనం వస్తూనే ఉంది. దీనిపై ఇటు సమంత, అటు నాగచైతన్య ఎన్నోసార్లు క్లారిటీ కూడా ఇస్తున్నారు.