Mukesh Ambani- ముకేష్ అంబానీ పిల్లలకు జీతమెంతంటే?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ముగ్గురు పిల్లలు.. ఆకాశ్‌, ఈశా, అనంత్‌లు బోర్డు డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు వాటాదార్ల అనుమతి కోరుతూ తీర్మానాన్ని వెల్లడించారు. అయితే బోర్డు డైరక్టర్లుగా వారికి ఎలాంటి జీతం ఉండదంట. బోర్డు సమావేశానికి హాజరైతే ఫీజు, కంపెనీ అర్జించిన లాభాలపై కమిషన్‌ను మాత్రమే వాళ్లకు చెల్లిస్తారు. ఈ తీర్మానాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వాటాదార్లకు పంపించారు. 2020-21 ఆర్థిక ఏడాది నుంచి ముకేశ్‌ అంబానీ కూడా కంపెనీలో జీతం లేకుండా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే తన వారసులు పనిచేయనున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ముకేశ్‌ సమీప బంధువులు నికిల్‌, హితల్‌ మాత్రం జీతంతో పాటు భత్యాలు, కమీషన్లు సహా ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం