nithiin
Home » Extra Ordinary Movie – ‘డేంజర్ పిల్ల’ సూపర్ హిట్

Extra Ordinary Movie – ‘డేంజర్ పిల్ల’ సూపర్ హిట్

by admin
0 comment

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్-డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకర‌ణ పూర్త‌య్యింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన మ్యూజికల్ జీనియ‌స్ హారిస్ జైరాజ్ మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌కు మంచి బీట్‌ను అందించాడు. ఈ పాట‌ను కృష్ణకాంత్ రాయ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించాడు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత హారిస్ జైరాజ్ ఓ తెలుగు సినిమాకు వర్క్ చేస్తున్నాడు. అతడు అందించిన బీట్, వినగా వినగా నచ్చుతుంది. కచ్చితంగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే.. నితిన్ ఇప్ప‌టివ‌ర‌కు కనిపించని క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడట. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమా వస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్‌ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నా పేరు సూర్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు వక్కంతం వంశీ. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు నితిన్ ను హీరోగా పెట్టి, దర్శకుడిగా మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links