వైరల్‌ అయిన వార్తపై స్పందించిన కోహ్లి

సాధారణంగా స్టార్‌ ప్లేయర్లు తమపై వచ్చే కథనాలపై ఎక్కువగా స్పందించరు. విమర్శలు, పొగడ్తలకు దూరంగా ఉంటారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆ జాబితాలోనే ఉంటాడు. అయితే క్రికేటతర విషయంపై వచ్చిన ఓ వార్తకు కోహ్లి తాజాగా స్పందించాడు. అది అవాస్తమని పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన అథ్లెట్లలో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడని, అతను ఒక్కో పోస్టుకు రూ.11.45 కోట్లు వసూలు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల వ్యాపార నిర్వహణ వేదిక హాపర్‌ హెచ్‌క్యూ వెల్లడించిన ఈ వివరాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

దీనిపై కోహ్లి స్పందించాడు. ”జీవితంలో అందుకున్న ప్రతిదానికీ కృతజ్ఞతతో ఉంటా, ఎంతో రుణపడి ఉంటా. కానీ, నా సామాజిక మాధ్యమాల ఆదాయం గురించి చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదు” అని శనివారం కోహ్లి ట్వీట్‌ చేశాడు. కాగా ఇన్‌స్టాలో కోహ్లి ఖాతాను ప్రస్తుతం 256 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. మరోవైపు హాపర్‌ హెచ్‌క్యూ నివేదిక ప్రకారం ఇన్‌స్టాలో అత్యధిక ఖరీదైన అథ్లెట్లలో రొనాల్డో (పోస్టుకు రూ.26 కోట్లు), మెస్సి (రూ.21 కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం