ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పరుగుల వరద పారిస్తోంది. పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. డికాక్ (114), డసెన్ (133) శతకాలతో కదంతొక్కారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 38 పరుగుల వద్ద బవుమా (24) ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డసెన్‌తో కలిసి డికాక్ ద్విశతక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ప్రపంచకప్‌లో వీరిద్దరు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే వచ్చిన లైఫ్‌లు ఉపయోగించుకున్న వీరిద్దరు.. మొదట్లో నిదానంగా ఆడారు. క్రమంగా బ్యాటింగ్‌లో దూకుడు పెంచుతూ మూడంకెల స్కోరును అందుకున్నారు. అయితే ఆఖర్లో మిల్లర్ (53) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 29 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా క్లాసెన్ (15*), మర్క్రమ్ (6*) కూడా బ్యాటును ఝుళిపించారు. ఆఖరి పది ఓవర్లలో దక్షిణాఫ్రికా 119 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథి రెండు వికెట్లు, బౌల్ట్, నీషమ్ చెరో ఒక వికెట్ తీశారు. కాగా, గాయం కారణంగా పేసర్ హెన్రీ బౌలింగ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.
318