Nepal earthquake- నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. అయితే ఈ భారీ భూకంపం తర్వాత శనివారం తెల్లవారుజామున కూడా 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. ఆ దేశంలో భూకంపం సంభవించడం నెల రోజుల్లో ఇది మూడోసారి. కాగా, నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9వేల మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. 800 కి.మీ దూరంలో ఉన్న దేశ రాజధాని దిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

నేపాల్‌కు అండగా ఉంటాం: మోదీ
నేపాల్‌ భూకంప విపత్తుపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని, ఎలాంటి సహకారమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. భూకంప మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..