ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా పేసర్‌

టీమిండియా బౌలర్‌ నవదీప్‌ సైని ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు స్వాతి ఆస్తానాను పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్దిమంది ఆత్మీయుల మధ్య సైని-స్వాతి ఒక్కటయ్యారు. పెళ్లి ఫొటోల‌ను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. స్వాతి యూట్యూబ్‌లో ఫ్యాషన్‌, టూరిజం, లైఫ్‌స్టైల్‌ గురించి వీడియోలు చేసే వ్లోగర్‌. ఇక సైని 2019లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గాయాల కారణంగా దూరమై జట్టులో చోటు కోల్పోయాడు. అయితే దేశవాలీ క్రికెట్‌, ఐపీఎల్‌లో సైని ఆడుతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరానీ కప్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా విజయంలో అతడు కీలకపాత్ర పోషించాడు. తాజాగా ముస్తాక్‌ అలీ టోర్నీలో 4 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే గత సీజన్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సైని మూడు వికెట్లు పడగొట్టాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం