హీరో నాని నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ డిసెంబర్ 7న థియేటర్లోకి వస్తుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మూవీయూనిట్ డిఫ్రెంట్‌గా ప్లాన్ చేసింది. నాని రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి ప్రెస్‌మీట్ పెట్టి ఓ మేనిఫెస్టో విడుదల చేశాడు. సోషల్ మీడియా ట్రెండ్‌కు తగ్గట్లుగా సరదాహామీలు ఇచ్చాడు. అయితే ఆఖర్లో యాంకర్ సుమ వివాదాన్ని అందులోకి లాగాడు నాని. ఓ ఈవెంట్‌లో సుమ మీడియా పర్సన్స్ మీద కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. కెమెరాలు పెట్టడం మరిచిపోయి స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని సుమ మీడియాను హర్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవ్వడంతో సుమ క్షమాపణలు కూడా చెప్పింది. ఇప్పుడు ఆ మేటర్‌ను నాని ఇండైరెక్ట్‌గా ప్రమోషన్స్‌లో లాగాడు. భోజనం చేశారా అంటూ నాని సింబాలిక్‌గా చూపించి.. సారీ చెప్పడానికి నేనేమైనా యాంకర్ అనుకుంటున్నావా.. పొలిటిషయన్ అని ప్రెస్‌మీట్ ముగించాడు.
353
previous post