బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం హాజరై సందడి చేసింది. అయితే ఈ వేడుకకు బాలకృష్ణ కుమారై నందమూరి తేజస్విని కూడా వచ్చింది. మూవీ సక్సెస్‌కు గుర్తుగా అందిస్తున్న జ్ఞాపికను సీనియర్ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు పిలుపు మేరకు.. స్టేజ్‌పైకి వచ్చి అందుకుంది. ఆ సమయంలో స్టేజ్‌పైనే ఉన్న బాలకృష్ణ కాస్త షాక్‌కు గురైనట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అనంతరం తేజస్వి తలపై చేయిపెట్టి దీవించాడు. బాలకృష్ణకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు బ్రాహ్మిని, కుమారుడు మోక్షజ్ఞ అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటారు. కానీ తేజస్విని మీడియాకు, సోషల్‌మీడియాకు చాలా దూరంగా ఉంటారు.