Naga Chaitanya: శ్రీకాకుళంలో నాగచైతన్య

యువ సామ్రాట్ నాగచైతన్య తను చేయబోయే కొత్త సినిమా కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశాడు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నాడు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగచైతన్య. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో 23వ చిత్రం ఇది. మేకర్స్ ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్ తాజాగా వైజాగ్ వెళ్ళారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా గార మండలం కె. మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారుల కుటుంబాలను కలిశారు. 6 నెలల క్రితం చందూ మొండేటి ఈ కథను నాగచైతన్యకు చెప్పాడు. వెంటనే ఓకే చెప్పాడు చైతూ. యదార్థ ఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశారు. వాస్, చందూ రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కోసమే, మత్స్యకారుల జీవనశైలిని తెలుసుకోవడానికి శ్రీకాకుళం వెళ్లాడు నాగచైతన్య. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ లేదా గోపీసుందర్ ను తీసుకునే అవకాశం ఉంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం