తాము నటించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రమోషన్లలో సాధారణంగా నటీనటీలు పాల్గొంటుంటారు. కొంతమంది కాస్త డిఫ్రెంట్‌గా ప్రమోషన్స్ చేయాలని ట్రై చేస్తుంటారు. ఇటీవల నాని.. ‘హాయ్ నాన్న’ కోసం పొలిటీషియన్‌గా అవతారమెత్తి ఫన్నీ ప్రెస్ మీట్ పెట్టాడు. తాజాగా అక్కినేని నాగచైతన్య తన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’ కోసం ప్రమోషన్లు మొదలుపెట్టాడు. దానిలో భాగంగా ఫ్యాన్స్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. వాళ్లతో కబుర్లు చెప్పి..అలానే వెబ్‌సిరీస్ గురించి మాటలు పంచుకుంటున్నాడు. అంతే కాకుండా వారికి గిఫ్ట్ బాక్సులు కూడా ఇస్తున్నాడు చైతూ. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన దూత సిరీస్‌కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించాడు. అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 1 నుంచి పాన్ ఇండియా భాషల్లో ఇది రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సిరీస్ ట్రైలర్‌ను చైతూ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు.