తన కుమారుడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని ఓ తల్లి ఆత్యహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నాగభూషణం, పుష్పజ్యోతి (41) దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త ప్రైవేటు ఉద్యోగి కాగా, భార్య గృహిణి. అయితే ఇటీవల వారి కుమారుడు సీఏ పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడు. తన కొడుకు పరీక్ష తప్పడంతో పుష్యజ్యోతి మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు గమనించేసరికే ఆమె మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.