2K
టీమిండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమి ఓ ప్రాణాన్ని కాపాడాడు. నైనిటాల్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి సకాలంలో సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని షమి ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘‘అతడు చాలా లక్కీ. దేవుడు పునర్జన్మనిచ్చాడు. నైనిటాల్‌కు సమీపంలో ప్రయాణిస్తుండగా.. నా ముందు వెళ్తున్న కారు ఘాట్ రోడ్డులోంచి లోయలోకి పడిపోయింది. నాతో పాటు సమీపంలో ఉన్న కొందరు అతడికి సాయం చేసి ఆసుపత్రికి పంపించాం” అని షమి తెలిపాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో షమి సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్త లేట్‌గా తుదిజట్టులోకి వచ్చినా..కీలక వికెట్లు తీస్తూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 24 వికెట్లు తీసిన షమి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.