పోలీసులపై మెస్సీ ఫైర్‌- స్టేడియంలో ఉద్రిక్తత

ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా బ్రెజిల్‌, అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఉద్రిక్తతకు దారితీసింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆటగాళ్లు మైదానంలో జాతీయ గీతాలు ఆలపించే క్రమంలో.. ఇరుజట్ల అభిమానుల మధ్య గొడవ మొదలైంది. దీంతో పోలీసులు అర్జెంటీనా అభిమానులను లక్ష్యంగా చేసుకొని చితకబాదారు. వెంటనే అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లు అక్కడికి చేరుకొని పోలీసులను వారించారు. ఓ దశలో మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోతామని, తన జట్టుతో పాటు మెస్సీ మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1–0తో బ్రెజిల్‌ను ఓడించింది. ప్రపంచకప్‌ క్వాలిఫయిర్స్‌లో స్వదేశంలో ఓడటం బ్రెజిల్‌కు ఇదే తొలిసారి. సాకర్‌లో బ్రెజిల్‌, అర్జెంటీనా చిరకాల ప్రత్యర్థులు. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే ఎప్పుడూ హైవోల్టేజ్‌లో ఉంటుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం